ఇద్దరు పోలీసులు సస్పెండ్.. 57 మంది పోలీసుల రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు పోలీసులు సస్పెండ్.. 57 మంది పోలీసుల రాజీనామా

June 6, 2020

57 Cops.

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని శ్వేతజాతి పోలీసు అధికారి కాలితో తొక్కి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అమెరికాలో నల్లజాతీయులు ఒక్కటయ్యారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా కరోనా ఓవైపు పొంచి ఉండగా, ఈ ఆందోళనలు అక్కడ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై నిరసన తెలుపుతూ 57 మంది పోలీసులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

జాతి వివక్ష వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ 75 ఏళ్ల వృద్ధుడి పట్ల పోలీసులు దయనీయంగా  ప్రవర్తించారు. పోలీసులు ఆ వృద్ధడ్ని కిందకు తోసేయడంతో అతని తలకు దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో వృద్ధడ్ని కిందకు తోసేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 57 మంది పోలీసులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.