జనవరి 13న వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు వెళ్లే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ క్రూయిజ్ కు గంగా విలాస్ అని పేరు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగా విలాస్ గురించి ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం జనవరి 13న ప్రధాని మోదీ ఈ ఓడను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కానీ అంతకుముందు నవంబర్ లోనే దీని గురించి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్.. ‘ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ వచ్చే ఏడాదిలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది’ అని ట్వీట్ చేశారు.
50 రోజుల్లో 3200 కి.మీ. ల ప్రయాణాన్ని కవర్ చేస్తుంది ఈ క్రూయిజ్. మొత్తం 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది. ఈ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్ ల మీదుగా సుమారు 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది. సుమారు 50 ప్రదేశాలను పర్యాటకులు చూడొచ్చు.
అదనంగా.. ఈ క్రూయిజ్ సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్ తో జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా కూడా వెళుతుతంది. క్రూయిజ్ లో అనుభవాన్ని ఆనందదాయకంగా మార్చడానికి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్, బట్లర్ సేవ మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఇందులో 80 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో కూడిన విలాసవంతమైన రివర్ క్రూయిజ్ నౌక. ప్రత్యేకమైన డిజైన్ తో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మించారు. ఎందుకంటే.. కోలకత్తాలోని హుగ్లీ నది వెంట వారణాసి గంగానది వరకు కూడా ఇది ప్రయాణించనుంది.