ఆర్బీఐ గుడ్ న్యూస్..లోన్ ఈఎంఐలు కట్టక్కర్లేదు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్బీఐ గుడ్ న్యూస్..లోన్ ఈఎంఐలు కట్టక్కర్లేదు!

March 27, 2020

All banks to allow three month moratorium on all term loans

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఇకపోతే ఆర్‌బీఐ చివరిగా గతేడాది అక్టోబర్ నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5.15 శాతానికి దిగొచ్చింది. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అలాగే లోన్ ఈఎంఐలపై 3 నెలలు మారటోరియం విధించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఔట్‌స్టాండింగ్ లోన్స్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది. దీని ద్వారా సిబిల్ స్కోర్‌పై ఎలాంటి దుష్ప్రభావం పడదని ఆర్బీఐ తెలిపింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.