దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా.. కేంద్రమంత్రి  - MicTv.in - Telugu News
mictv telugu

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా.. కేంద్రమంత్రి 

October 26, 2020

కరోనా

‘మా పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా ఇప్పిస్తాం’ అని బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీ మీద తీవ్ర దూమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు మాత్రమే కాకుండా దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి వెల్లడించారు. ఒడిశాలోని బాలసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొని ఈ మేరకు ప్రకటించారు. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఆయన మీడియా ముందు చెప్పారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దాదాపు రూ.500 ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. 

అక్టోబర్ 20న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్‌లను అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు. అవి ప్రస్తుతం వివిధ క్లినికల్ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటి ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. దీంతో వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. కాగా, బీహార్ ఎన్నికల సందర్భంగా.. బీజేపీ మేనిఫెస్టోలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని పొందుపరిచిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలు పార్టీలు బీజేపీ హామీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్ కూడా ఈ హామీ తుచ్ అన్నారు. మరోవైపు తమిళనాడు, మధ్యప్రదేశ్, అస్సాంలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందివ్వనున్నట్టు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం.. దేశంలో ప్రలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుని దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తానని వెల్లడించింది.