దేశంలో గత 8 ఏండ్లుగా అయితే జుమ్లా లేకపోత ఆమ్లా అనే విధానంలో మోదీ ప్రభుత్వం దాడులు చేస్తున్న మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అదే బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఈడీ, సీబీఐ, ఐటీ చూపెట్టగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని పత్రికలు చెబుతున్నా.. ఆ ప్రభుత్వంపై దర్యాప్తు సంస్థలు దృష్టి కూడా పెట్టవని అన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యే కుమారుడు రూ. కోట్లతో దొరికినా వారిపైకి ఈడీ పోదని అన్నారు.
బీజేపీలో చేరగానే కేసులన్ని ఏమై పోతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ బీజేపీలో చేరగానే కేసులన్ని మాయమైపోయాయి. సుజనా చౌదరిపై 6 వేల కోట్ల కేసు ఏమైందని ప్రశ్నించారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చారు. సువేందు అధికారిపై కేసులు ఏమయ్యాయి? అని అడిగారు. బీబీసీ మీద దాడి చేసిన వ్యక్తి.. మీరేంత అని ఇండియా మీడియాపై మోదీ అహంకారం ప్రదర్శిస్తున్నారు.
గౌతం అదానీ టూ గొటబాయ డీల్ అని శ్రీలంక ప్రతినిధి అన్నారని కేటీఆర్ తెలిపారు. మోదీ-అదానీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసని, నిక్కర్ వేసుకున్న ఐదో తరగతి పిల్లాడికి కూడా మోదీ బినామీ గౌతమ్ అదానీ అని తెలుసన్నారు. అదానీపై కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అదానీపై శ్రీలంక ఆరోపణలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.