భారతీయులారా తక్షణమే కీవ్‌ను వీడండి - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులారా తక్షణమే కీవ్‌ను వీడండి

March 1, 2022

modi

‘ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులారా తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రష్యా బలగాలు ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భీకర దాడులు చేస్తున్నాయి. కావున కీవ్ ప్రాంతంలో ఉన్న భారతీయ విద్యార్థులు, భారతీయ పౌరులు రైళ్లతోపాటు అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాల ద్వారా వెంటనే వెళ్లిపోవాలని కోరింది.

ఆ ప్రకటనలో పేర్కొన్న అంశాలు..

1. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
2. ఉక్రెయిన్ పౌరులను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
3. భయానక వాతావరణం నెలకొంది.
4. కీవ్ నుంచి భారతీయులు అందరూ వెంటనే వెళ్లిపోవాలి.
5. రైళ్లు, అందుబాటులో ఉన్న వాహనాలు ద్వారా వెళ్లండి అని సూచించారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎయిర్ ఫోర్స్ సాయాన్ని కోరారు. ఉక్రెయిన్‌లో సుమారు 10,000 మంది వరకు భారతీయులు ఉన్నారు. ఇప్పటికి 4,000 మంది వెనక్కి వచ్చారు. ఎయిర్ ఇండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయులను తీసుకువస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సాయాన్ని ప్రధాని కోరినట్లు సమాచారం.