కొత్త మంత్రులంతా డమ్మీలే: లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త మంత్రులంతా డమ్మీలే: లోకేశ్

April 13, 2022

roja

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లోకి వచ్చిన కొత్త మంత్రులంతా ఉత్తి డమ్మీలేనని.. నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భజన చేసిన వాళ్లకే జగన్ మంత్రి పదవులిచ్చారని అన్నారు. బుధవారం మంగళగరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలను లోకేశ్ పంచిపెట్టారు.

అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ” ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సీఎం అయ్యాక అన్ని ధరలను పెంచుకుంటూ పోతున్నాడు. వచ్చే నెలలో వచ్చే కరెంటు బిల్లులను చూసి టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. అధికారంలోకి వచ్చాక 2. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కానీ ఇంతవరకు వాటి ప్రస్తావనే లేదు. వైసీసీ హామీ ఏమైంది?” అని లోకేశ్ ప్రశ్నించారు.