కన్నడే మాకు ముఖ్యం.. యడ్యూరప్ప - MicTv.in - Telugu News
mictv telugu

కన్నడే మాకు ముఖ్యం.. యడ్యూరప్ప

September 16, 2019

CM Yediyurappa

దేశ ప్రజలు అందరూ హిందీ భాష తప్పినిసరిగా నేర్చుకోవాలని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దక్షిణ భారతదేశం నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విషయమై పెద్ద చర్చే నడుస్తోంది. 

తాజాగా ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. మాకు కన్నడ భాషే ముఖ్యం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలో ఉన్న అధికారిక భాషలన్నీ సమానమే. కర్ణాటక ప్రజలకు కన్నడ కూడా ప్రధాన భాషే. కన్నడ భాష ప్రాముఖ్యాన్ని, రాష్ట్ర సంస్కృతిని కాపాడటంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయం’ అని ట్వీట్‌లో తెలిపారు. 

కర్ణాటక ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కన్నడిగులు నిరసనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం స్థానికులకు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అలాంటి నేత బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలాడిస్తారని భావించారు అందరు. కానీ, ఆయన అనూహ్యరీతిలో అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించడం సంచలనంగా మారింది. బీజేపీలో సీనియర్ నేతగా వున్న యడ్యూరప్ప కన్నడ భాషే తమకు ముఖ్యం అని మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్‌, ప్రముఖ నటుడు కమల్‌హసన్‌ సహా పలువురు నాయకులు అమిత్‌ షా ప్రకటనపై వ్యతిరేకంగా స్పందించిన విషయం తెలిసిందే.