కుక్కల కోసం ప్రత్యేక విమానం..మన దేశంలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కల కోసం ప్రత్యేక విమానం..మన దేశంలోనే..

June 5, 2020

All-pet.

లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఎక్కడి ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కొందరు తమ కుటుంబసభ్యులను, స్నేహితులను మిస్‌ అవుతున్నారు. మరి కొందరు తమ పెంపుడు జంతువులను మిస్ అవుతున్నారు. వాటిని తెచ్చుకుందామంటే విమానాల్లో అనుమతి లేదు. 

ఈ నేపథ్యంలో అక్రిష‌న్ ఏవియేష‌న్ అనే ఓ ప్రైవేట్‌ జెట్ సంస్థ‌ కేవలం పెంపుడు జంతువుల కోసం ప్ర‌త్యేకంగా ఒక విమానాన్ని ప్రారంభించింది. ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. ఆరు పెంపుడు జంతువుకు అందులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆ విమానం మొత్తం కిరాయి 9 ల‌క్ష‌ల 60 వేలు కాగా, ఒక్కో సీటు ధర రూ. లక్షా 60వేలుగా నిర్ణయించారు.  ప్రస్తుతానికి విమానంలోని నాలుగు సీట్లు బుక్ అయ్యాయి. ఇంకో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విమానంలో సీట్లు బుక్‌ చేసుకున్న వాటిలో రెండు షిహూ తుజ‌స్, ఓ గోల్డెన్ రిట్రీవ‌ర్ శున‌కాలు, లేడీ ఫిజంట్ ప‌క్షి ఉన్నాయి. ఢిల్లీ నుంచి ముంబై వ‌ర‌కు కేవ‌లం పెంపుడు జంతువుల కోసమే ఈ విమానాన్ని న‌డుపుతున్న‌ట్లు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా దీపికా సింగ్ మాట్లాడుతూ..’కొంతమంది వారి పెంపుడు జంతువులను తమతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు. లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో అన్ని రకాల పెంపుడు జంతువులు వంటివి వారి యజమానుల వద్దకు క్షేమంగా పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అక్రిష‌న్ ఏవియేష‌న్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా.’ అని తెలిపారు.