హాలీడేస్ మూడ్ లో రాజకీయ పార్టీలు...! - MicTv.in - Telugu News
mictv telugu

హాలీడేస్ మూడ్ లో రాజకీయ పార్టీలు…!

August 2, 2017

ఏమైందో గానీ అన్ని రాజకీయ పార్టీ ఆఫీసులు బోసిగా కనిపిస్తున్నాయి.ఎటువోయిన్రు లీడర్లంత ?రాజకీయ పార్టీలు ఏమైనా సెలవులు ప్రకటించాయా ? ఇప్పుడు పండగలు పబ్బాలు కూడా లేవుకదా, లేకపోతే చర్చించుకోవడానికి సమస్యలేమి లేవా?తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ లో ఉన్న ఏ పార్టీ ఆఫీసు జూశినా లైబ్రరీని తలపించే నిశబ్ధం. ఏమయ్యింది లీడర్ల సందండి ?ఎటుపోయ్నయ్ ప్రెస్ మీట్ల అలజడి ?నిత్యం లీడర్ల బరువును ఆనందంగా మోసిన పార్టీ ఆఫీసు కుర్చీలు..లీడర్ల జాడలేక వెల వెల బోయాయి,గల గలా మాట్లాడే లీడర్ల గొంతు వినక పార్టీ ఆఫీసులున్న మైకులు మూగబోయాయి,ప్రతిరోజు పార్టీ ఆఫీసులకు హాజరిచ్చే బీట్ రిపోర్టర్లు…లీడర్లులేక.. వాళ్లెప్పుడస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూసే పరిస్థితి,ఎందుకంటే లీడర్ల చిన్న బైట్లు కూడా లేకుండా బులిటెన్ ఎలా నడిపియ్యాలో తెలియని పరిస్థితి.

గులాబీ దండు నుంచి ఎర్రజెండా పార్టీలదాకా అన్ని దుకాణాలు బంద్ అన్నట్టుగానే ఉంది పరిస్ధితి.టిఆర్ ఎస్  పార్టీ నుండి లెఫ్ట్ పార్టీ ల దాక నాయకులు లేక ఖాళీగా కనిపిస్తున్న పార్టీ ఆఫీసలు.పార్టీ ఆఫీసుల ప్రెస్ మీట్లు బంజేశి..సెక్రెటేరియట్ లల్ల,అసెంబ్లీ ఆఫీసులల్ల ప్రెస్ మీట్లు పెడ్తున్రు గులాబీ లీడర్లు.అప్పుడప్పుడు చోటా మోటా లీడర్లు తెలంగాణ భవన్ల హడావిడి చేసినా అది ప్రపంచం దృష్టికి పోతలేదు.ఈళ్ళ సంగతి ఇట్లుంటే ఇక అంత అంత మాత్రాన ఉన్న టీడీపీ, పూర్తిగా కార్యక్రమాలు  లేక మీడియా ఛానల్ లు పట్టించుకోవడం మానేసాయ్..రేవంత్ రెడ్డి అటో ఇటో తన్లాడుతుండు,కనీ ఆయన కూడా టిడిపి ఆఫీసుకి సుట్టం సూపులకే వచ్చిపోతుండు.మీడియా వ్యవహారాలు చూసుట్ల టిడిపిని మించిన పార్టీ లేకుండే ఒకప్పుడు,ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలంటే కూడా అక్కడ సమాచారం ఇచ్చే దిక్కులేకుండా అయ్యింది పరిస్ధితి.

ఎపి తో పోల్చుకుంటే తెలంగాణ లో కాస్త నయం అని చెపుకుంటున్న టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సైతం ఖాళీగా కన్పిస్తుంది..ఒకలిద్దరు నాయకులు తప్ప,ఎవరూ పార్టీ ఆఫీసు మెట్లు ఎక్కడంలేదు.ఇక్కడ కూడా సేమ్ సీన్.ఇగ వైసీపీ సంగతి  చెప్పనక్కర్లేదు, తెలంగాణాలో తట్టా బుట్టా సదుర్కున్న వైసీపి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యింది కాబట్టి ఆ పార్టీ కార్యాయలం గురించి చర్చించుకోవాల్సిన అవుసరంలేదు. Bjp పార్టీ ఆఫీస్ లో కేంద్ర మంత్రులు వచ్చినపుడు మాత్రమే హడావిడి కన్పిస్తుంది…మిగిలిన సమయం లో నాయకులూ పార్టీ ఆఫీస్ మొకం కూడా చూసే పరిస్థితి లో లేరు,కేంద్రమంత్రులు ఎప్పుడూ రాలేరు కదా,వాళ్లు యాడాదికోపారో వస్తారు. లెఫ్ట్ పార్టీ లకు కూడా పెద్ద గ పని లేకపోవడం తో ఖాలీగా కన్పిస్తున్నాయి,అయితే ఎన్నికల సీజన్ కోసం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.మరి అప్పుడన్న పార్టీ ఆఫీసులు కళకళలాడుతాయో లేదో సూడాలే.