‘మనం’ సినిమా గుర్తుంది కదా..అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అదరగొట్టేశారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగాచైతన్య, అఖిల్ నటించిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది సంక్రాంతికి కూడా తండ్రీకొడుకులు నాగర్జున, నాగచైతన్య బంగర్రాజుగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక మరోసారి అక్కినేని హీరోల నుంచి మల్టీస్టారర్ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. తన వందో సినిమాలో కుమారుడుతో కలిసి నటించేందుకు నాగార్జున సిద్ధమవుతున్నారు.
ఈ మధ్య సినిమాలను నాగార్జున తగ్గించారు. ఆశించిన విజయాలు దక్కకపోవడంతో పాటు..మార్కెట్ తగ్గడంతో ఆచితూచి ఆడుగులు వేస్తున్నారు. రిస్క్ చేయకుండా ప్లాన్ ప్రకారం కొత్త సినిమాలకు ఒకే చెప్తున్నారు. ప్రస్తుతం యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ సినిమాలో నాగార్జున నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
అనంతరం గాఢ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజా తయరు చేసిన కథకి నాగార్జున పచ్చజెండా ఊపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథ స్ట్రిప్టులో దశలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నట్లు సమాచారం. అందులో అఖిల్ అక్కినేని కూడా నటించబోతున్నారనే వార్త చక్కెర్లు కొడుతోంది. ఇదే నిజమైతే తన వందో సినిమాలో కొడుకుతో కలిసి నాగార్జును ప్రేక్షకులను అలరించనున్నారు.
అఖిల్ తన ‘ఏజెంట్’ సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఆ సినిమా క్లైమాక్స్, ఒక పాట మినహా మొత్తం పూర్తి అయింది. సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.