All set for tomorrow's IPL-2023 auction
mictv telugu

ఐపీఎల్-2023 వేలానికి సర్వం సిద్ధం.. కోటికి పైగా బేస్ ప్రైస్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే..

December 22, 2022

All set for tomorrow's IPL-2023 auction

ఐపీఎల్ -2023 వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. మ.2.30 గంటలకు వేలం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు. ఇక నచ్చిన ఆటగాడిపై కాసుల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. దాదాపు 405 మంటి ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు.
వీరిలో 273 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. పది ఫ్రాంచైజీలు కలిసి 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. . 30 మంది విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ కు చెందిన 19మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో బరిలోకి దిగనున్నారు. రూ. 1.5 కోట్లు బేస్ ధరతో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. కోటి రూపాయల బేస్ ధరతో 20 మంది బరిలో ఉన్నారు. కోటీ రూపాయల బేస్ ప్రైస్‌లో భారత్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్ , కేదార్ జాదవ్, మనీష్ పాండేలు ఉన్నారు.

రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :

కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), టామ్ బాంటన్ (ఇంగ్లండ్), సామ్ కర్రాన్ (ఇంగ్లండ్), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), నాథన్ కౌల్టర్-నైల్ (ఆస్ట్రేలియా), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్), టైమల్ మిల్స్ (ఇంగ్లండ్), జామీ ఓవర్టన్ (ఇంగ్లండ్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్), జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్),రైలీ రస్సో (దక్షిణాఫ్రికా), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా).

రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :

షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్),ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జాసన్ రాయ్ (ఇంగ్లండ్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), సీన్ అబాట్ (ఆస్ట్రేలియా), రిలే మెరెడిత్ (ఆస్ట్రేలియా), రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్).

రూ. కోటి బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :

మయాంక్ అగర్వాల్ (భారత్), కేదార్ జాదవ్ (భారత్), మనీష్ పాండే (భారత్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్థాన్), మోయిసెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), ల్యూక్ వుడ్ (ఇంగ్లండ్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), టామ్ లాథమ్ (న్యూజిలాండ్), డారెల్ మిచెల్ (న్యూజిలాండ్), హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా), తబ్రైజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా), కుసల్ పెరీరా (శ్రీలంక), రోస్టన్ చేజ్ (వెస్టిండీస్), రహ్కీమ్ కార్న్‌వాల్ (వెస్టిండీస్), షాయ్ హోప్ (వెస్టిండీస్), అకిల్ హుస్సేన్ (వెస్టిండీస్ ), డేవిడ్ వైస్ (నమీబియా).

ఇవి కూడా చదవండి :

క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమ్ఇండియా.. బ్యాటింగ్‌కి దిగిన బంగ్లా

ఎంబాపెను ఎగతాళి చేసిన అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్‌పై విమర్శలు