ఆ వార్తలు అవాస్తవం: గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ వార్తలు అవాస్తవం: గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు

February 21, 2022

14

ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, వాటిని నమ్మకండి అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వచ్చిన వార్తలు అవాస్తవం అని వాటిని ఖండించారు. వారు మాట్లాడుతూ.. “నిన్న రాత్రి పెళ్లి వేడుకకు వెళ్లి 9.45 గంటలకు గౌతమ్ రెడ్డి ఇంటికి వచ్చారు. రోజులాగే ఉదయం 6 గంటలకు మేల్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు ఇతరులతో మాట్లాడారు. 7 గంటలకు ఇంట్లోని సోఫాలో కూర్చున్నారు. ఉదయం 7.12 గంటలకు డ్రైవర్‌ను పిలవమని వంటిమనిషికి చెప్పారు. ఉదయం 7.15 గంటలకు గుండెపోటుతో సోఫా నుంచి కిందకు దిగారు.

అనంతరం 7.18 గంటలకు ఆయన ఛాతీపై చెయ్యి వేసి డ్రైవర్ నాగేశ్వరరావు ఉపశమనం కలిగించారు. అక్కడే ఉన్న గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారు. ఆ తర్వాత మంచినీరు కావాలని గౌతమ్ రెడ్డి అడిగారు. మంచినీరు తాగలేని పరిస్థితుల్లో ఉన్న ఆయనను చూసిన శ్రీకీర్తి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ఉదయం 7.22 నిమిషాలకు గుండెనొప్పి వస్తుందని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్దామని సిబ్బంది చెప్పారు. ఇంటి నుంచి ఆస్పత్రికి 5 నిమిషాల్లో చేరుకున్నాం. అపోలో ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకెళ్లాం. ఉదయం 8.15 గంటలకు పల్స్ బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 9.13 గంటలక గౌతమ్ రెడ్డి మరణించినట్లు అపోలో వైద్యులు నిర్ధారించారు” అని వారు తెలిపారు.