3 గంటల సినిమా అర్జున్ రెడ్డి ! - MicTv.in - Telugu News
mictv telugu

3 గంటల సినిమా అర్జున్ రెడ్డి !

August 19, 2017

ఆగస్ట్ 25 కు విడుదలౌతున్న ‘ అర్జున్ రెడ్డి ’ సినిమా మీద ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. ట్రైలర్ లాంచ్ కే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తేదీ 24 రోజు సాయంత్రమే ఆడియన్స్ కోసం బెనిఫిటి షోలు వేస్తున్నారంటే ఈ సినిమా మీద ఎంత క్రేజ్ పెరిగిందో అర్థం చేస్కోవచ్చు. ఈ సినిమా ప్రొడ్యూసర్లు కథ మీద ఫుల్లు కాన్పిడెన్సుగా వున్నారని ఇట్టే తెలిసిపోతోంది.

సినిమాలోని డైలాగులు ఇప్పటికే ఎంత హల్ చల్ చేసాయో తెల్సిందే. సెన్సార్ వారితో ‘ ఎ ’ సర్టిఫికేట్ పుచ్చుకొని వస్తున్న ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు. అంత లెంతు వుంటే జనాలు చూస్తారా అనేదే క్వశ్చన్ ఇక్కడ ? కంటెంట్ బాగుంటే తప్పకుండా చూస్తారు.

మరి అర్జున్ రెడ్డి కంటెంట్ ఏ విధంగా వుండబోతోందో 25 కే చేడాలి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్టే అంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. షాలిని హీరోయిన్ గా పరిచయమౌతోంది. చూడాలి మరి విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో ? విజయ్ దేవరకొండకు ‘ ద్వారక ’ ఫట్టు తర్వాత ఇది హిట్టిస్తే ఇంక తనకు తిరుగు లేదని నిరూపించుకున్నట్టే. అదే రోజు విఐపి 2, వివేకం, కథలో రాజకుమారి సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిని అధిగమించి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను రంజింపజేస్తుందో. ఆల్ ది బెస్ట్ అర్జున్ రెడ్డి క్రూ అండ్ కాస్ట్.