జయ జానకి నాయకకు ఆల్ ది బెస్ట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

జయ జానకి నాయకకు ఆల్ ది బెస్ట్ !

August 10, 2017

తెలుగు ఆడియన్స్ రేపటి కోసం చాలా ఎగ్జైంటింగ్ గా వున్నారు. ఎందుకంటే రేపు ‘ జయ జానకి నాయక ’ సినిమా రిలీజ్ అవుతుంది గనక. భారీ స్థాయి అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్ కంప్లీట్ డిఫరెంటుగా వుంది. బోయపాటి శ్రీను సంధిస్తున్న ఈ ఫ్యామిలీ, యాక్షన్ బాణం తప్పకుండా హిట్టు కొడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ట్రైలర్ లోనే చాలా ఫ్రెష్ నెస్ ని చూపించారు. ‘ సరైనోడు ’ తర్వాత బోయపాటి శ్రీను మంచి స్ర్కిప్టుతో, తనదైన మార్క్ టేకింగ్ తో అటు మాస్ ఆడియన్సును, ఇటు క్లాస్ ఆడియన్సును అలరించడానికి ‘ జయ జానకి నాయక ’ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. మరొక ఇంట్రెస్టింక్ పాయింట్ ఏమిటంటే హీరో, డైరెక్టర్ల పేర్లు శ్రీనూలే అవడం విశేషం.

‘ అల్లుడు సీను ’ తో చిత్ర సీమలోకి అడుగు పెట్టి తెలుగు ఆడియన్సుకు ‘ అరే.. మన పక్కింటి సీనుగాడిలానే వున్నాడే ’ అన్నంత ఇదిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్కున్నాడు. మాస్ లుక్స్, కమర్షియల్ సినిమాలకు వుండాల్సిన క్వాలిటీలన్నీ శ్రీనివాస్ లో పర్ ఫెక్టుగా వుండటంతో తొందరగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన తదుపరి చిత్రంగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ స్పీడున్నోడు ’ ఎందుకో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాబట్టి తన మూడవ అడుగు అస్సలు తడబడకూడదనుకున్నాడు సాయి శ్రీనివాస్. అందుకే ఈసారి బోయపాటి శ్రీనును ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఎంత కష్టపడ్డాడో తెర మీద తెలుస్తోంది. అంతకు ముందు సినిమాలకు ఈ సినిమాలకు టోటల్ గా తన లుక్కును మార్చేసాడు. బాగా జిమ్ము చేసి రాటు దేలిన దేహంతో మిస్టర్ పర్ ఫెక్టులా కన్పిస్తున్నాడు. తన తండ్రి, నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ కొడుకు కెరియర్ ను మలచడంలో కీలకంగా వ్యవహరిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కు ముందే స్టార్ మా ఛానల్ వాళ్ళు 5 కోట్లకు శాటిలైట్ హక్కులను కొనుక్కున్నారట. అలాగే హిందీలో కూడా డబ్బింగ్ వెర్షన్ ను సోని నెట్ వర్క్ వాళ్ళు 7 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.

దీన్ని బట్టి ఎవరికి వారు అంచనా వెయ్యొచ్చు ఈ సినిమా ఏ రేంజు సినిమానో. బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాను చాలా బాగా తెరకిక్కించాడని తెలిసిపోతోంది. ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయకిలుగా నటించారు. వారి గ్లామర్ ఈ సినిమాకు ఇంకొక ప్లస్ పాయింటు. అలాగే జగపతి బాబు, శరత్ కుమార్, ఆది పినిశెట్టిలు ఇందులో ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే జనాల్లో మాంచి ఊపును క్రియేట్ చేసింది. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుదామా.