వైసీపీ ఎంపీల ఔదార్యం..విరాళంగా నెల జీతం - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎంపీల ఔదార్యం..విరాళంగా నెల జీతం

March 25, 2020

YSRCP

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్ళింది. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైనది. వాళ్ళను ఆదుకోవడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్, నితిన్ తదితరులు సాయం ప్రకటించిన సంగతి తెల్సిందే. 

తాజాగా వైసీపీ ఎంపీలు కూడా అదే దారిలో నడిచారు. ఓ నెల జీతాన్ని ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు.. మరో నెల జీతాన్ని ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని వైసీపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనాపై యుద్ధానికి ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సాయం అందిస్తున్నామన్నారు.