All those who criticized me are stupid .. Nani comments again on movie ticket rates
mictv telugu

నన్ను తిట్టేవాళ్లు తెలివి తక్కువోళ్లు.. టికెట్ రేట్లపై నాని

June 7, 2022

All those who criticized me are stupid .. Nani comments again on movie ticket rates

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ విడుదలకు రెడీ అయింది. సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు, ఇంట‌ర్వ్యూలో నాని చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా థియేట‌ర్స్‌లో టికెట్ రేట్స్‌పై మాట్లాడుతూ.. ‘‘న‌న్ను విమ‌ర్శించేవాళ్లంతా తెలివి త‌క్కువవాళ్లు. గతంలో 20..40..60 రూపాయ‌ల టికెట్ ధ‌ర‌ల‌తో సినిమా ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ సాధించ‌లేద‌ని అన్నాను. అంతే కానీ టికెట్ ధ‌ర‌ను రూ.500 పెంచ‌మ‌ని అడ‌గ‌లేదు. అప్పుడు నేను మాట్లాడింది త‌ప్ప‌యితే.. ఇప్పుడు వారు పెంచడంకూడా త‌ప్పే’’ అన్నారు.

ఇంత‌కు ముందు శ్యామ్ సింగ‌రాయ్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో టికెట్ రేట్స్ గురించి నాని మాట్లాడిన మాట‌లు ఎంత సంచ‌ల‌నం రేపాయో చెప్పక్కర్లేదు. సినిమా టికెట్ రేట్స్‌ను త‌గ్గించి ప్రేక్ష‌కుడిని అవ‌మానించారంటూ అన‌డం.. సినిమా థియేట‌ర్ కంటే ప‌క్క‌నున్న కిరాణా షాపులోనే ఎక్కువ డ‌బ్బులుంటాయనే అప్ప‌టి నాని వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేలా ఉన్నాయంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా నానిని విమ‌ర్శించారు. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రించారంటూ నాని అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు మ‌ళ్లీ ‘అంటే.. సుంద‌రానికీ!’ విడుదల సమయంలో కూడా నాని సినిమా టికెట్ రేట్స్‌పై మట్లాడిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.