నిప్పులకొలిమి..జరభద్రం - MicTv.in - Telugu News
mictv telugu

నిప్పులకొలిమి..జరభద్రం

May 17, 2017

ప్రచండభానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిలా మారాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాలలో 44 డిగ్రీలు, వరంగల్‌, కరీంనగర్‌లో 43, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో 42 డిగ్రీలు, నిజామాబాద్‌, హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలోని విజయవాడ, గుంటూరు, రెంటచింతల, ఏలూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజమండ్రి, ఒంగోలులో 45, కడపలో 44 డిగ్రీలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. విజయనగరం, అనంతపురంలో 42 డిగ్రీలు, విశాఖ, శ్రీకాకుళం, హిందూపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

HACK:

  • All time highest Temperatures in Telugu states.