హైదరాబాద్‌లో ‘అందరూ ఆడవాళ్ల’ రైల్వేస్టేషన్   - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ‘అందరూ ఆడవాళ్ల’ రైల్వేస్టేషన్  

March 7, 2018

మీరు ఇకపై హైదరాబాద్‌లోని విద్యానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌కు వెళ్తే అక్కడి సిబ్బందిలో ఒక్క మగపురుగూ కనిపించదు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్‌ను ‘ఆల్ ఉమెన్ స్టేషన్’‌గా మార్చారు. బుధవారం నుంచే మొత్తం మహిళా సిబ్బందితో విధులు మొదలయ్యాయి.’

సీతాఫల్‌మండి-ఫలక్ నుమా సెక్షన్‌లో ఉన్న విద్యానగర్ స్టేషన్‌ను రైల్వే ఉద్యోగినుల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచడానికి ఆల్ ఉమెన్ స్టేషన్‌గా మార్చినట్లు దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఓ ప్రకటనలో తెలిపింది. స్టేషన్‌లో లేడీ కమర్షియల్ క్లర్కులు, ఎంక్వయిరీ, రిజర్వేషన్ క్లర్కులు, ఆర్పీఎఫ్, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ మహిళలే ఉంటారు.

మహిళ సాధికారత, సౌకర్యాల కోసం ఇప్పటికే కాచిగూడ స్టేషన్‌లో నాప్కిన్ వెండింగ్ మెషిన్లను, వెయింటింగ్ హాళ్లను, పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.