మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై కీలక తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై కీలక తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు

May 6, 2022

మసీదులలో ఆజాన్ సందర్బంగా లౌడ్ స్పీకర్లు వాడడంపై ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం ప్రాథమిక హక్కేం కాదని తేల్చి చెప్పింది. ఇర్ఫాన్ అనే వ్యక్తి బదౌన్ జిల్లా పరిధిలో నూరి అనే మసీదుపై లౌడ్ స్పీకర్ పెట్టుకుంటానని అనుమతి కోసం సబ్ కలెక్టర్‌కు దరఖాస్తు చేశాడు. పరిశీలించిన సబ్ కలెక్టర్ లౌడ్ స్పీకర్లకు అనుమతినివ్వలేదు. దీంతో ఇర్ఫాన్ హైకోర్టుకు వెళ్లాడు. సబ్ కలెక్టర్ అనుమతినివ్వకపోవడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, చట్టపరమైన హక్కులకు వ్యతిరేకమని పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ వికాస్‌లు ‘మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం రాజ్యాంగపరమైన హక్కు కాదని చట్టంలో ఉంద’ని ఆదేశాలు జారీ చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.