కామెడీ హీరో అల్లరి నరేష్ తన పంథాను పూర్తిగా మార్చేశాడు. తను చేసిన కామెడీ సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అవుతుండడంతో…కొన్నాళ్ళు యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా రూట్ మార్చేసి కొత్తరకం సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. మహర్షిలాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో యాక్టింగ్ చేస్తూనే సోలో హీరోగా కూడా ఢిపరెంట్ సబెక్ట్స్ ఎంచుకుంటూ ముందు వెళిపోతున్నాడు. హిట్, ఫ్లాప్ లను పటటించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినా నరేష్ ఉగ్రం సినిమా ట్రైలర్ చూసిన వాళ్లందరూ మాత్రం అవాక్కయిపోతున్నారు. ఇది నిజంగానే నరేషేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కామెడీ హీరోగా కెరీర్ మొదలుపెట్టినా యాక్టింగ్ లో ఎప్పుడూ నరేష్ బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. కెరీర్ మొదట్లోనే గమ్యం సినిమాలో అతను చేసిన గాలిశీను క్యారెక్టర్ తో అందరి మనసులనూ, అవార్డులనూ గెలుచుకున్నాడు. అయితే చాలా రోజుల వరకూ కామెడీ ప్రవాహంలోనే కొట్టుకుని పోయాడు. ఇప్పడు అందులో నుంచి బయటపడి కొత్త తరహా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన నాంది సినిమా అలాంటిదే. నాంది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన మూవీనే ఉగ్రం. ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు అల్లరి నరేష్.
నరేష్ తన పేరు నుంచి అల్లరిని పూర్తిగా పక్కనపెట్టేశాడు. ఈ టీజర్‌లో మునుపెన్నడూ లేని అవతార్‌లో కనిపించిన ఆయన.. నిజంగానే పోలీస్ పాత్రలో ఉగ్రరూపం చూపించాడు. తన హ్యాపీ ఫ్యామిలీ లైఫ్‌ను నాశనం చేసిన వ్యక్తులను వేటాడే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ చాలా ఇంటెన్స్‌గా నటించాడు. అంతేకాదు శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్‌పై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక టీజర్ లాంచింగ్ లో నరేష్ మాట్లాడుతూ… ఒక డైరెక్టర్‌ను వంద శాతం నమ్మినపుడు తనకు హిట్స్ వచ్చాయని అన్నాడు. క్రిష్, సముద్ర ఖని డైరెక్షన్ లో చేసిన సినిమాలే అందుకు ఉదాహరణ అని చెప్పాడు. వాళ్ళ తర్వాత దర్శకుడు విజయ్ నాంది చిత్రంతో తనను కొత్తగా ఆవిష్కరించాడని చెప్పాడు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత ఉగ్రం మూవీతో కొత్త కోణంలో ప్రజెంట్ చేయబోతున్నాడని చెప్పాడు.
నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఇక మీదట చేస్తానని చెప్పాడు నరేష్. విజయ్ డైరక్షన్ లో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాని అన్నాడు. ఉగ్రం మూవీ మార్చి 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే నరేష్ కెరీర్ గాడిలో పడ్డట్టే.