న్యూడ్‌గా అల్లరి నరేష్‌..'నాంది' ఫస్ట్‌లుక్‌ - MicTv.in - Telugu News
mictv telugu

 న్యూడ్‌గా అల్లరి నరేష్‌..’నాంది’ ఫస్ట్‌లుక్‌

January 20, 2020

nbghbnh

ఒకప్పుడు కామెడీతో తెలుగు ప్రజలను అలరించిన యువ నటుడు అల్లరి నరేష్‌ సీరియస్ అయ్యాడు. ఇటీవల కాస్త డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబుతో పాటు మహర్షి సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 

నరేష్‌ 57వ సినిమాగా తెరకెక్కుతున్న ‘నాంది’ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నరేష్‌ ఒంటిపై బట్టలు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. నరేష్‌‌ను ఈ లుక్‌లో చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మరో దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రియదర్శి, ప్రవీన్‌, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకల సంగీతం అందిస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా సిద్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.