ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల్లో 25వ చిత్రంగా వచ్చిన ‘నో టైమ్ టు డై’ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి క్యారీ జోజీ ఫుకునాగా. కాగా, ఆయనతో తాను మూడేళ్లు లైంగిక సంబంధం కొనసాగించానని 18 ఏళ్ల అమ్మాయి గతవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. క్యారీతో దిగిన సెల్ఫీ పంచుకుంటూ ఆ యువతి ‘గతిలేని పరిస్థితుల్లో ఆయనతో మూడు సంవత్సరాలు లైంగిక సంబంధం కొనసాగించాను. అతను రోజూ నాతో సెక్స్ చేసేవాడు. అతడి నుంచి బయటపడదామనుకున్నా భయంతో వెనకడుగు వేసేదాన్ని.
నా గురించి ఎవరైనా అడిగితే మేనకోడలు, బంధువు లేదా సోదరిలా బిహేవ్ చేయమని ఒత్తిడి చేసేవాడు. అతడి గురించి నిజాలను ఎవ్వరికీ తెలియనిచ్చేవాడు కాదు. చివరకు ఎలాగోలా బయటపడ్డాను’ అంటూ రాసుకొచ్చింది. ఈమె ఇలా ఉండగా, క్యారీపై మరో ఇద్దరు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. ‘20 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ షో చేశాం. అప్పుడు మూడేళ్లు మమ్మల్ని లైంగికంగా వేధించాడు. ఓసారి మా ఇంటికి వచ్చి ముగ్గురం కలిసి సెక్స్ చేద్దామని అడిగాడు. దానికి మేము ఒప్పుకోలేదు’ అని ఆ నటీమణులు వెల్లడించారు. కాగా, ఈ ముగ్గురు మహిళల ఆరోపణలపై క్యారీ జోజీ ఫుకునాగా ఇంతవరకు రెస్పాండ్ అవలేదు.