నిజమైతే కాల్చి చంపండి.. పులివెందుల టీడీపీ అభ్యర్థి - MicTv.in - Telugu News
mictv telugu

నిజమైతే కాల్చి చంపండి.. పులివెందుల టీడీపీ అభ్యర్థి

March 15, 2019

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణలను నిజమైతే తనను నడిరోడ్డుపై కాల్చి చంపాలని సవాల్ విసిరారు. వివేకానంద మృతిని కూడా వైఎస్సార్ సీపీ రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. అంతకుముందు.. వివేకాది సాధారణ మృతి కాదని, హత్యేనని, ఇందులో మంత్రి ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

Allegations Against Me Are True Shoot Me On The Road.. Pulivendula TDP Candidate Satish Reddy.

 

దీంతో సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ నేతలు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, నాపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి పోయేకాలం దగ్గరికొచ్చింది. అందుకే ఇంతగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేకా హత్యకు కారణం ఎవరో త్వరలోనే బయటపడుతుంది. ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించాలి. కుటుంబ కలహాలే వివేకా మృతికి కారణమి ప్రజలందరికి తెలుసు. బాబాయి మృతిని కూడా వైసీపీ నీచ రాజకీయం చేస్తోంది. జగన్‌కు సిగ్గులేదు. రాజారెడ్డి మరణం విషయంలో కూడా నాపై కేసు పెట్టారు. వైసీపీ అనవసరపు ఆరోపణలు మానేస్తే మంచిది’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు హత్యేనని నిర్ధారించారు. శరీరంపై ఏడు చోట్ల కత్తితో పోడిచిన గాయాలున్నాయని పేర్కొన్నారు. దీంతో వివేక హత్యపై ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.