బీజేపీ నేత అత్యాచారం చేశాడు.. సజ్జనార్‌కు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ నేత అత్యాచారం చేశాడు.. సజ్జనార్‌కు ఫిర్యాదు

February 3, 2020

BJP leader

ఆఫీసుకు పిలిచి కాఫీలో మత్తు మందు కలిపి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బీజేపీ నేత ఎం రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తన ఫిర్యాదు చేశారు.  ‘నా విడాకుల విషయంలో రఘునందన్ నన్ను వాళ్ల ఆఫీసుకు పిలిపించాడు. కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. నేను స్పృహ కోల్పోయాక నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని అడ్డు పెట్టుకుని ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు’ అని బాధిత మహిళ ఆరోపించారు. 

తనకు న్యాయం చేయాలని సీపీని బాధితురాలు వేడుకున్నారు. రఘునందన్ రావు దురాగతంపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.