ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రులకు శాఖలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రులకు శాఖలు ఇవే

April 11, 2022

bfnbn

ఏపీలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇందులో గతంలో మాదిరి ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఇందులో పాత డిప్యూటీ సీఎంలకు మళ్లీ అవకాశం దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కె. నారాయణ స్వామి(ఎస్సీ), అంజాద్ బాషా (మైనార్టీ)లకు మళ్లీ అవకాశం దక్కగా, కొత్తగా పి.రాజన్న దొర(ఎస్టీ), కొట్టు సత్యనారాయణ (కాపు), బూడి ముత్యాల నాయుడు (బీసీ)లను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. మహిళకు మాత్రం ఈ సారి అవకాశం దక్కలేదు. ఇక మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

1. పెద్దిరెడ్డి – విద్యుత్ శాఖ, అటవీ శాఖ
2. వేణుగోపాల కృష్ణకు సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖలు
3. విశ్వరూప్‌కి రవాణా
4. తానేటి వనితకి హోం శాఖ
5. జయరాంకు కార్మిక శాఖ
6. ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్
7. కాకాణి గోవర్థన్ రెడ్డికి వ్యవసాయం
8. దాడిశెట్టి రాజాకి ఆర్అండ్‌బీ
9. విడదల రజనికి వైద్య శాఖ
10. రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ
11. జోగి రమేశ్ – గృహ నిర్మాణ శాఖ
12. కారుమూరి నాగేశ్వరరావుకి పౌరసరఫరాలు
13. బూడి ముత్యాలనాయుడుకి పంచాయితీ
14. అంబటి రాంబాబుకు జలవనరులు
15. మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమ శాఖ
16. రోజాకు పర్యాటక, యువజన శాఖ
17. కొట్టు సత్యనారాయణకు దేవాదాయ శాఖ
18. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గతంలోలాగా ఆర్ధిక శాఖ
19. బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ
20. ఉషశ్రీ చరణ్‌కు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
21. ఆదిమూలపు సురేష్ – మునిసిపల్ శాఖ
22. అంజాద్ బాషాకు మైనార్టీ సంక్షేమం
23. సీదిరి అప్పలరాజుకు పశు సంవర్ధక శాఖ
24. గుడివాడ అమరనాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖలు
25. నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖలు కేటాయించారు.