Allu Aravind Aiming For Another Blockbuster Just Like Kantara With Thodelu
mictv telugu

3కోట్లు పెడితే 60కోట్ల లాభాలు.. అల్లు అరవింద్ ఖాతాలో మరో కాంతార ?

November 11, 2022

టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత అల్లు అరవింద్. సుప్రీం హీరో చిరంజీవిని మెగాస్టార్ చేసిన ఘనత గీతాఆర్ట్స్ కే దక్కుతుందని అంటారు. కథల ఎంపిక, బడ్జెట్ కంట్రోల్, ప్రమోషన్స్ అంశాల్లో అరవింద్ కి ఇండస్ట్రీలో మాస్టర్ బ్రెయిన్ అని పేరుంది. అందుకే చిరంజీవి సైతం అరవింద్ కి లైన్ చెప్పాకే సినిమా కమిట్ అవుతారని టాక్. అలాంటి అల్లు అరవింద్ తాజాగా వరుస హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నాడు. కేవలం 3కోట్లకి తెలుగు రైట్స్ కొని విడుదల చేస్తే.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని కాంతార షేక్ చేసి పడేసింది.

ఈ చిత్రం2 వారాల్లోనే 45 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం స్ట్రయిట్ ఫిల్మ్స్ కూడా దారుణంగా ఫ్లాప్ అవుతున్న చోట.. ఒక డబ్బింగ్ చిత్రంతో దాదాపుగా 60 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు.ఇక తన కుమారుడు అల్లు శిరీష్ ’ఊర్వశివో రాక్షసివో’ చిత్రం సైతం మంచి వసూళ్లని రాబడుతుంది. కావాల్సినంత బూతు పెట్టి యువతని బాగానే అట్రాక్ట్ చేశారు మేకర్స్. పెట్టిన దానితో పోలిస్తే ఇప్పటికే ఈ మూవీ లాభాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే జోష్ తో అరవింద్ మరో ప్రాజెక్టు ని పట్టేసాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న ‘భేదియా’ సినిమాను ఆయన తెలుగులో ‘తోడేలు’ పేరుతో విడుదల చేస్తున్నారు. హారర్-కామెడీ జానర్‌లో నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ సినిమా. అయితే ఇప్పటి వరకు విడుదలైన తోడేలు పాటలు, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో అల్లు అరవింద్ కి కాంతార స్థాయిలో మరో హిట్ ఖాయమంటున్నారు.