Allu Aravind madhu mantena Mahabharat web series announcement
mictv telugu

అల్లు-మంతెన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అప్ డేట్

September 10, 2022

Allu Aravind madhu mantena Mahabharat web series announcement

హాలీవుడ్ స్థాయిలో రామయణ, మహాభారతాలను తెరకెక్కించడానికి బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీవీ సీరియళ్లు వచ్చిన మారుతున్న గ్రాఫిక్స్, టెక్నాలజీలను రంగరించి మరింత కనవిందుగా ఈ ఇతిహాసాలను ప్రేక్షకుల మందుకు తీసుకురావడానికి వేల కోట్ల బడ్జెట్ తో రంగంలోకి దిగారు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కలసి ‘మహాభారతం’ మూవీకి ప్లాన్ చేయడం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును సినిమా నుంచి వెబ్ సిరీస్‌కు మార్చినట్లు తాజా అప్డేట్ వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో దీన్ని ప్రసారం చేయనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని భవనాలు, ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ సన్నివేశాల చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘ఒక అద్భుత ఇతిహారం. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీకు ముందుకు వస్తోంది. ఎదురు చూస్తూ ఉండండి’ అని ప్రకటించారు. ఎప్పుడు ప్రసారమవుతుంది, నటీనటులెవరు, వంటి విషయాలు మాత్రం వెల్లడించలేదు. అల్లు ఎంటర్ టైన్ మెంట్స్, మైధోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్మిస్తున్నాయి.