Allu Aravind told the real truth about 'Geetha Arts'
mictv telugu

గర్ల్ ఫ్రెండ్ పేరుతో ‘గీత ఆర్ట్స్’.. ఇన్నేళ్ళకు ఆ నిజం చెప్పిన అల్లు అరవింద్

October 19, 2022
ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది పెద్ద బ్యానర్స్ లో గీత ఆర్ట్స్ ఒకటి. మరోరకంగా చెప్పాలంటే నంబర్ వన్ బ్యానర్. సుప్రీం హీరో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి ప్రధానంగా సహకరించిన సంస్థ. అప్పట్లో వరుసగా ఈ బ్యానర్ పై మెగాస్టార్ సినిమాలు వచ్చేవి చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాస్ట్రో ఇళయరాజా.. 1990లలో ఈ కాంబినేషన్ ఒక సెన్సేషన్.
పదే పదే ఈ కాంబినేషన్ ని సెట్ చేయటంమే గీత ఆర్ట్స్ సక్సెస్ కి ప్రధాన కారణం అంటుంటారు. ఇక ఆ తరువాత చిరంజీవి కుటుంబ సభ్యులతోను బ్లాక్ బస్టర్ హిట్ సిన్మాలు తీసింది ఈ సంస్థ. అలాంటి ఈ ప్రతిష్టాత్మక సంస్థ గీత ఆర్ట్స్ పేరులో అసలు గీత ఎవరు అన్నది ఇప్పటికీ ఎవ్వరికి తెలియని సీక్రెట్. అల్లు, మెగా ఫ్యామిలిలో గీత అనే పేరుతో ఎవరు లేరు. కానీ అల్లు అరవింద్ మిత్రులు మాత్రం.. గీత అంటే అరవింద్ గర్ల్ ఫ్రెండ్ అని ఏడిపిస్తుండేవారు.
అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ రూమర్ పై తాజాగా స్పందించారు అల్లు అరవింద్. కమెడియన్ ఆలీ అడిగిన ఈ ప్రశ్నకు జవాబిస్తూ.. నాకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఓపెనప్ అయిపోయారు అరవింద్. అందుకే తన గర్ల్ ఫ్రెండ్ పేరే బ్యానర్ కి పెట్టానని నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఏడిపిస్తుండేవారు. అయితే నేను నా బ్యానర్ కి మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టలేదని చెప్పారు. గీత ఆర్ట్స్ అనే పేరుని తన తండ్రి అల్లు రామలింగయ్య గారు పెట్టారని రివీల్ చేశాడు. సినిమా నిర్మాణ రంగంలోకి దిగాలని ఆలోచన వచ్చినప్పుడు ఏ పేరు పెడితే బావుంటుందని నాన్నగారిని అడిగితే.. ఈ పేరుని పెట్టమన్నారని చెప్పారు. ‘ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం దేవుడు చూసుకుంటాడు’ అని భగవద్గీతలో ఉంటుంది. ఇది సినిమాలకు సరిగ్గా సరిపోతుంది. అందుకే మన బ్యానర్ కి గీత ఆర్ట్స్ పేరు పెట్టాలని అల్లు రామలింగయ్య చెప్పినట్టు అల్లు అరవింద్ వెల్లడించాడు.