నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘18 పేజెస్’మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం మంచి జోష్‌లో ఉంది. సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ సందడి చేశారు. హీరోయిన్ అనుపమతో కలిసి వీరిద్దరు డ్యాన్స్ వేశారు. స్టేజ్‌పై ముగ్గురు స్టెప్స్ ఇరగదీశారు. మొదట అల్లు అరవింద్, అనుపమ డ్యాన్స్‌ను ప్రారంభించగా తర్వాత సుకుమార్ కాలు కదిపారు. దీనిని నిఖిల్ సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి “కుమారి 21ఎఫ్” ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. సుకుమార్ ఈ సినిమాకి కథను అందించారు. . ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా రావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. డిసెంబర్ 23 వేదిన విడుదలైన ‘18 పేజెస్’మంచి కలెక్షన్స్‌తో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ ఏడాది ‘కార్తికేయ 2’ తో హిట్ అందుకున్న హీరో నిఖిల్ ‘18 పేజెస్’తో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.