సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల వరకు ఖర్చు చేశారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ భరతుడు క్యారెక్టర్ లో నటించింది. తాజాగా ఓ ప్రమోషన్ లో సమంత అర్హని తెగ ముద్దులాడేసింది.ఈ సినిమాలో మొదటి రోజు షూటింగ్ లో 100 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య పర్ఫామెన్స్ చేయాల్సి వచ్చింది. అంత మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్న కూడా అర్హ మాత్రం ఎలాంటి భయం లేకుండా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది.
ఇక అర్హ తెలుగు డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉంది. అర్హని చూసిన తర్వాత పుట్టుకతోనే సూపర్ స్టార్ అనే బ్రాండ్ కి కరెక్ట్ గా సూటబుల్ అవుతుందని అనిపించింది అంటూ సమంత ప్రశంసలు కురిపించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బన్నీ ఫ్యాన్స్ సమంత చేసిన ఈ కామెంట్స్ ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అర్హ పాత్ర ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుంది. మూవీ క్లైమాక్స్ అర్హ పోషించిన భరతుడు పాత్రతోనే ముగుస్తుంది అని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో కూతురు నటించిన మొదటి సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.