ఇక నుంచి నా పేరు సూర్య అంటారందరు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఇక నుంచి నా పేరు సూర్య అంటారందరు !

July 13, 2017

DJ అల్లు అర్జున్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటిస్తాడనే ఉత్సుకత చాలా మంది అల్లు ఫ్యాన్స్ లో వుంది. జూన్ 14 న ముహూర్తం కూడా జరుపుకుంది ‘ నా పేరు సూర్య ’ నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఆన్ సెట్స్ కు వెళ్ళనుంది. మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించిన అనూ ఇమాన్యెయేల్ బన్నీతో జత కట్టనుంది. అలాగే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనుకుంటున్నారు ? కథా రచయిత వక్కంతం వంశీ. ఈ సినిమాతో మెగా ఫోన్ మెగా ఫోన్ పట్టనున్న మరో రచయితగా టాలీవుడ్ లో తన సత్తా చాటనున్నాడు. ప్రత్యేక శ్రద్ధ తీస్కొని ఈ సినిమా పకడ్బందీ ప్లానింగ్ తో డిజైన్ చేస్తున్నాట్ట. ఇప్పటికే రామానాయుడు సినీ విలేజ్ లో వేస్తున్న సెట్టు తుది మెరుగులు దిద్దుకుంటోంది. బన్నీ కూడా చాలా కసరత్తులు చేస్తున్నాడని సమాచారం.

రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీవాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించడం విశేషం. ఇద్దరు అర్జున్ లు నటిస్తున్న సినిమా అవడంతో ఇప్పటికే చాలా ఇంట్రెస్టును క్రియేట్ చేసింది నా పేరు సూర్య.