మా విమానాలు వాడుకోండి..గో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

మా విమానాలు వాడుకోండి..గో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం

March 27, 2020

కరోనా భూతాన్ని దేశం నుంచి తరిమేయడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. విమానాల నుంచి వీధుల్లో తిరిగే వాహనాల వరకూ అన్నింటిని అధికారులు నిలిపివేశారు. దీంతో అన్ని ఎక్కడికక్క నిలిచిపోయి కనిపిస్తున్నాయి. వైరస్ కారణంగా రోజు రోజుకు రోగుల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో గో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఏదైనా అత్యవసర సమయాల్లో తమ విమాన సర్వీసులను వాడుకోవాలంటూ ప్రభుత్వాలకు సూచించింది.

56 విమానాలు ఉన్న గో ఎయిర్ సంస్థ దేశ పౌరులను చేరవేసేందుకు విమానాలు కావాలంటే ఇస్తామని ప్రకటించింది. అవసరమైన సిబ్బందిని కూడా సమకూరుస్తామని పేర్కొంది. వ్యాది నివారణలో తమ వంతు సాయం అందిస్తామన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు 650 విమానాలు నేలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్‌పై యుద్ధం చేసేందుకు తమ వంతుగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాలకు అందిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు.