allu arjun bollywood movie with director rohit shetty
mictv telugu

షాకింగ్ న్యూస్.. బన్నీ చిత్రంలో బాలీవుడ్ బడా స్టార్స్ అందరు ?

December 3, 2022

allu arjun bollywood movie with director rohit shetty

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా వెలుగుతున్న అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ ని పుష్పషేక్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే సౌత్ లో కంటే నార్త్ లోనే పుష్పకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. నార్త్ బెల్ట్ అంతా బన్నీ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయింది. హిందీ పుష్ప మ్యారిజమ్స్, డైలాగ్స్, డాన్స్ లపై కుప్పలు తెప్పలుగా రెల్స్, మీమ్స్ వచ్చాయి. దాంతో బాలీవుడ్ లో బన్నీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప బాలీవుడ్ లో 100కోట్లకు పైగా వసూల్ చేయగా.. ఇప్పుడు 500కోట్ల టార్గెట్ గా పుష్ప2 టీమ్ ప్రణాళికలు చేస్తుంది. అయితే ఈ బన్నీ క్రేజ్ ని క్యాచ్ చేసుకోవడానికి ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన కాంబినేషన్ కి ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు బాలీవుడ్ లో భారీ కమర్షియల్ చిత్రాలు చేసే రోహిత్ శెట్టి.
పుష్ప చూసి బన్నీపై మక్కువతో రోహిత్ శెట్టి పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడట.

గోల్ మాల్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సింబా, సూర్య వంశీ, సింగమ్ రిటర్న్స్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రోహిత్ శెట్టి తన తదుపరి చిత్రం బన్నీతోనే అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌ల స్పెషల్ అప్పియరెన్స్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ కార్తీ కనిపించాలని డైరెక్టర్ రోహిత్ శెట్టి కోరుకుంటున్నట్లుగా న్యూస్ బయటకు వస్తోంది. అంటే పాన్-ఇండియా లెవెల్‌లో బన్నీ పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరు స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నట్టు బీ టౌన్ లో రూమర్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం.. రణ్‌వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే లతో రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘సర్కస్’ మూవీ డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ మూవీ విడుదల అవ్వగానే బన్నీతో చేయబోయే మల్టి స్టారర్ పై మరింత క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది.