Home > Featured > బన్నీకి కూతురు స్వీట్ వార్నింగ్..

బన్నీకి కూతురు స్వీట్ వార్నింగ్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు తన కూతురు అర్హ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బన్నీ ఒళ్లో కూర్చుని ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటూ చెప్పింది. దీన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ముద్దు ముద్దు మాటలతో అర్హ చెబుతున్న డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇది చూసిన వారంతా ‘ఏ స్వీట్ వార్నింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో చాలా సరదగా ఉంటాడు. తన ఇంట్లోని ఫన్నీ సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలాగే తాజాగా మొహన్ బాబు చెప్పిన డైలాగ్ తన కూతురుతో చెప్పించి ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.వీరిద్దరి అల్లరిని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.

Updated : 20 Aug 2019 11:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top