అల్లు అర్జున్ డైలాగ్‌పై తీవ్ర విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్ డైలాగ్‌పై తీవ్ర విమర్శలు

April 9, 2018

దక్షిణ భారతదేశానికి ఉత్తరాది పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీఎంల నుంచి సామాన్యుల వరకు నిరసన తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండుపై కేంద్రం నుంచి స్పందన లేదు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం పొందుతున్న కేంద్రం సగం కంటే తక్కువగా వెనక్కి ఇస్తోంది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారని ఉత్తారాది నేతలు దూషిస్తుండం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ‘నా పేరు సూర్య‘లోని ఒక డైలాగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బన్ని బర్త్ డే సందర్భంగా ఈ డైలాగును విడుదల చేశారు. ఇందులో హీరో.. ‘సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్‌, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మ‌నకి.. ఒక్క‌టే ఇండియా‘ అని డైలాగ్ దంచేశాడు. ఈ డైలాగ్ దక్షిణాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఉత్తరాది పాలకులు అన్యాయం చేస్తున్న నేపథ్యంలో డైలాగును మార్చి ఉండాల్సిందని, దేశభక్తి పేరుతో ఒక ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కప్పిపుచ్చలేని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఉత్త చేతులు చూపుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.