దర్శకేంద్రుడి నూరవ చిత్రం, హీరోగా అల్లు అర్జున్ మొదటి చిత్రం ‘గంగోత్రి’ సినిమా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో నటించిన బాలనటులు ఇప్పుడు హీరో హీరోయిన్లు అయ్యారు. ఈ సినిమాలోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటలో చిన్నప్పటి అల్లు అర్జున్ గా నటించిన తేజా సజ్జా ఇప్పటికే జాంబీ రెడ్డి, ఓ బేబీ , అద్భుతం సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక చిన్నప్పటి గంగోత్రిగా నటించిన చిన్నారి కూడా అతి త్వరలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఆ పాపే కావ్య. ‘బాలు’, ‘విజయేంద్ర వర్మ’, ‘అడవి రాముడు’ తదితర సినిమాల్లో బాల నటిగా మెప్పించిన కావ్య.. త్వరలోనే మసూద అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్లో నిర్వహించిన టాక్ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. గంగోత్రి సినిమా చేస్తున్న సమయంలో అల్లుఅర్జున్.. తన పక్కన హీరోయిన్గా నటించాలని అడిగారని గుర్తుచేసుకుంది. అప్పటికి తాను చిన్న పిల్లకావడంతో ‘నేను హీరోయిన్ అయ్యే టైమ్‌కి మీరు ముసలివాళ్లు అయిపోతారు’ అని సమాధానమిచ్చానని కావ్య నవ్వుతూ చెప్పింది. మసూద చిత్రం గురించి మాట్లాడుతూ.. “బాల నటిగా 12 సినిమాల్లో నటించా. మసూద.. హీరోయిన్గా నేను నటించిన తొలి చిత్రం. మసూద అనేది ఉర్దూ పదం. ఇలాంటి హారర్ డ్రామా సినిమా మన తెలుగులో ఇటీవల రాలేదనుకుంటున్నా” అని కావ్య చెప్పింది. ఈ సినిమాలో హీరో టక్ జగదీశ్ ఫేమ్ తిరువీర్.