Allu Arjun gave 15 lakhs to build a house for his personal driver
mictv telugu

డ్రైవర్‌‌ ఇంటికి స్వయంగా వెళ్లి రూ. 15 లక్షలిచ్చిన అల్లు అర్జున్

November 11, 2022

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృత్వం గురించి శుక్రవారం రెండు వార్తలు వెలుగులోకి వచ్చాయి. మొదటిది కేరళలో ఓ ముస్లిం నర్సింగ్ విద్యార్ధిని చదువు, హాస్టల్ ఖర్చులను నాలుగేళ్లు అందిస్తానని అలెప్పీ కలెక్టర్‌‌కి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సదరు కలెక్టర్ స్వయంగా సోషల్ మీడయా ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసింది. ఇక రెండోది, తాజాగా వెలుగు చూసింది తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న డ్రైవరుకి రూ. 15 లక్షల నగదు సాయం ప్రకటించడం. అదీ స్వయంగా డ్రైవర్ ఇంటికి వెళ్లి ఆర్ధిక సాయం చేశారు.

వరంగల్ జిల్లాకు చెందిన మహిపాల్ అనే వ్యక్తి అల్లు అర్జున్ వద్ద పదేళ్ల నుంచి డ్రైవరుగా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉండడంతో తన పర్సనల్ డ్రైవరుగా ప్రమోషన్ ఇచ్చాడంట. అయితే మహిపాల్ బోరబండలో ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ స్వయంగా డ్రైవర్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను కలిసి వారిని ఆనందంలో ముంచెత్తారు. దీనికి సంబంధించిన పోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ అభిమాన హీరో దాన గుణాన్ని మెచ్చుకుంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా, తన సొంత స్టాఫ్‌‌ని మంచిగా చూసుకోవడంతో తమిళ స్టార్ హీరో అజిత్ ముందు వరుసలో ఉంటారు. ఆయన తన వద్ద పని చేసే వారందరికీ సొంతంగా ఇంటి జాగా కొని అందులో ఇల్లు కట్టించి ఇవ్వడం తెలిసిందే.