ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రి మురళి రాజు మంతెన మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు హైదరాబాద్‌లో ప్రాణాలు విడిచారు. మురళి రాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు మధురానగర్లోని మురళి రాజు నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ముంబై నుంచి వచ్చి ఆయన పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
భీమవరం చెందిన మురళి రాజు.. ప్రముఖ సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి మేనమామ అవుతారు. ఆయన గతంలో నిర్మాతగా పనిచేసి పలు వ్యాపారాలు చేశారు. మురళి రాజుకు కుమారుడు మంతెన మధు, కూతురు అంబికా ఉన్నారు. మధు నిర్మాతగా కొనకొనసాగుతున్నారు. అతడు ఎక్కువగా హిందీ చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్లో గజినీ, సూపర్ 30, ఉడ్తా పంజాబ్, ’83 తదితర ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీలో కూడా పలు చిత్రాలను నిర్మించారు.