Allu Arjun Pushpa 2 Teaser With Avatar 2 Movie
mictv telugu

అవతార్ 2లో అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

November 5, 2022

ఐకాన్ స్టార్ అంటూ ఏ టైంలో పేరు పెట్టారో కానీ అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశానికి తాకుతుంది. హిందీలో సాధారణ అంచనాలతో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాంతో పుష్పపై సౌత్ స్టేట్స్ లో మొదట్లో వచ్చిన నెగిటీవ్ టాక్ కాస్త పాజిటీవ్ గా మారి లాభాలతో ముగిసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ బాక్సాఫీస్ ని మాత్రం షేక్ చేసి పడేసింది పుష్ప. నార్త్ బెల్ట్ లోని రూరల్ మాస్ ఆడియన్స్ పుష్పకి నీరాజనం పలికారు. తగ్గేదేలే వంటి మ్యానరిజమ్స్ కావొచ్చు, శ్రీవల్లి సాంగ్ రీల్స్ అవ్వొచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయ్యాయి. దాంతో పుష్ప2 అత్యంత భారీ హైప్ వచ్చేసింది. ఈ భారీ అంచనాల దృష్ట్యా.. దర్శకుడు సుకుమార్ పుష్ప2 ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని టాక్. ఇప్పటికే పుష్ప2 లో బన్నీ లుక్స్ లీక్ అవ్వగా.. ఐటం సాంగ్ పై కూడా పేద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో పుష్ప2పై మరో అద్దిరిపోయే వార్త ఒకటి తాజాగా బయటికొచ్చింది. హాలీవుడ్ ఐకానిక్ ఫిలిం ‘అవతార్ 2’ లో అల్లు అర్జున్ కనిపించనున్నారని తెలుస్తుంది. అవతార్ 2కి ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రజలు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అవతార్ 2 క్రేజ్ ని క్యాచ్ చేసుకుంటూ.. గ్లోబల్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా భారీ ప్లాన్ వేశాడు సుకుమార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా పుష్ప2 గ్లింప్స్‌ సిద్ధమవుతుందని సమాచారం. అయితే అవతార్ 2 సినిమాతో పాటు గనక పుష్ప-2 సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేయగలుగుతే.. అది ఖచ్చితంగా పుష్ప2 సినిమాకు బాగా కలిసొస్తుందని అల్లు అర్జున్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. అవతార్-2 సినిమా గ్లోబల్ ఆడియెన్స్ చూసే సినిమా కావడంతో, పుష్ప-2 కూడా వారికి రీచ్ అవ్వడం ఖాయంమంటున్నారు. మరి సుక్కు ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.