అల్లు అర్జున్ తో మైకేల్ జాక్సన్ బయోపిక్ ? - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్ తో మైకేల్ జాక్సన్ బయోపిక్ ?

July 28, 2017

‘ ఫిదా ’ సినిమా సక్సెస్ మీట్ లో ఆర్. నారాయణ మూర్తి చాలా ఎమోషనలయ్యాడు. ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఫిధా సినిమా తనకు పిచ్చపిచ్చగా నచ్చినట్టుంది. ఇలాంటి సినిమాలు ముందు ముందు దిల్ రాజుగారు ఇంకా తియ్యాలని కోరుకున్నాడు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టాలని కోరాడు. అలాగే అల్లు అర్జున్ మీద పొగడ్తల వర్షం కురిపించడమే కాదు. నెక్ట్స్ మూవీని అల్లు అర్జున్ తో ప్లాన్ చెయ్యాలని సలహా ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ గనక ప్లాన్ చేస్తే దానికి అల్లు అర్జున్ అయితేనే కరెక్టని ఎర్రోడు స్టేజీ మీద అనేసాడు. అల్లు అర్జున్ కూడా ఈ ప్రత్యేకమైన సినిమా కోసం డేట్స్ ఎన్నైనా ఇచ్చి మంచి సినిమా తియ్యాలని మరీ మరీ కోరాడు. చూడాలి మరి ఈ చీమలదండు నాయకుడు కోరిన కోరికను దిల్ రాజు నెరవేరుస్తాడేమో !