Allu Arjun : విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అల్లుఅర్జున్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎవరి నోట విన్నా తగ్గేదేలే అన్న డైలాగే ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఈ క్రేజ్ కారణంగా ఇప్పుడు పుష్ఫ 2 పై ప్రజల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప ఫ్రాంచైజీలో రెండవ సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను నటించే జవాన్ చిత్రంలో అల్లు అర్జున్ ను అతిధి పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే డేట్స్ లేకపోవడంతో అర్జున్ చాలా ఆలోచించిన తర్వాత ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ జవాన్ బృందం నుండి సినిమా కథను ,కథనాన్ని కూడా ముందే తెలుసుకున్నాడట. అయినప్పటికీ, ఎంత ప్రయత్నించినా పుష్ప 2 లో బిజీగా ఉండటం, ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ ఆఫర్ ను వద్దనుకున్నాడు.
ఇదిలా ఉంటే వైజాగ్, హైదరాబాద్‌లో ని కొన్ని లొకేషన్ లలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెకెండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్ తన పాత్రకు జీవం ఇచ్చేందుకు కఠినమైన శిక్షణ పొందుతున్నాడని తెలుస్తోంది. రాబోయే కొన్ని నెలలు, బన్నీ కేవలం పుష్పా 2 పైనే తన దృష్టి పెట్టబోతున్నాడు. అర్జున్ ఇటీవల విశాఖపట్నంలో పుష్ప 2 షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశాడు. అక్కడ మేకర్స్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించారు. మూవీ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ సెట్స్ నుండి చిత్రాలను గతంలో పంచుకున్నారు.
ఈ సెకెండ్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్ , ఫహద్ ఫాసిల్ పైనే ఉండనుంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే సెకెండ్ పార్ట్ పై క్లారిటీని ఇచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్న, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పుష్ప, ది రైజ్‌లో, అర్జున్ ‘తగ్గేదే లే’ అనే క్యాచీ వర్డ్ ను పరిచయం చేసినట్లే, రెండవ భాగంలోనూ ఇలాంటి ఓ కొత్త క్యాచీ పదాన్ని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.