అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజులో పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఓ పొగాకు ఉత్పత్తుల సంస్థ తమ తరపున యాడ్ చేసి పెడితే భారీ పారితోషికం చెల్లిస్తామని ముందుకొచ్చింది. అయితే పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అలాంటి వాటిని నేను ప్రమోట్ చేయనని తేల్చి చెప్పేశాడు. అంతేకాక, తనకు ధూమపానం అలవాటు లేదని, అలాంటప్పుడు ప్రజలకు వాటిని వినియోగించమని ఎలా చెప్పగలనంటూ తిరస్కరించాడు. తన అభిమానులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయనని కరాఖండీగా చెప్పేశాడంట. ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తన అభిమాన హీరో తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల పుట్టిన రోజు వేడుకలకు సెర్బియా వెళ్లిన అల్లు అర్జున్ తిరిగొచ్చి ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో పాల్గొంటున్నాడని సమాచారం.