allu arjun shared cute pic on his marriage anniversary
mictv telugu

క్యూటీ హ్యాపీ యానివర్సరీ..వైరల్ అవుతున్న బన్నీ పిక్

March 6, 2023

 

allu arjun shared cute pic on his marriage anniversary

Allu Arjun : పుష్పా 2 తో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‏కు ఆల్ ఇండియా వైడ్‏గా మంచి క్రేజ్ లభించింది. తనదైన స్టైల్, మ్యానరిజమ్‏తో ఇండస్ట్రీలో స్టార్డమ్‏ను సంపాదించుకున్నాడు బన్నీ. ఓ వైపు సినిమా షూటింగ్‏లతో బిజీ బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటాడు బన్నీ. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‏ను ఖుషీ చేస్తుంటాడు. రీసెంట్‏గా బన్నీ నెట్టింట్లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. తన భార్య స్నేహతో కలిసి దిగిన క్యూట్ పిక్‏ను బన్నీ తన ఇన్‏స్టాగ్రామ్ ప్రొఫైల్‏లో షేర్ చేసి అభిమానులను అలరించాడు.

మార్చి 6వ తేదీ అంటే అల్లూ అర్జున్‏కు, స్నేహకు వెరీ స్పెషల్. ఎందుకంటే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు ఇది. ఈ రోజు ఈ క్యూట్ కపుల్ 12వ వెడ్డింగ్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ స్నేహతో దిగిన సెల్ఫీ పిక్‏ను అల్లూ అర్జున్ నెట్టింట్లో షేర్ చేశాడు. దీంతో ఈ జోడీకి సెలబ్రిటీల దగ్గిరి నుంచి ఫాలోవర్స్ వరకు ఇన్‏స్టాగ్రామ్ వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు.

అల్లూ అర్జున్ ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. తన ఇన్‏స్టాగ్రామ్ చెక్ చేస్తే ఈ విషయం క్లియర్‏గా అర్ధమవుతుంది. తన కూతురుతో చేసిన షార్ట్ అండ్ క్యూట్ వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటాడు బన్నీ. భార్యతో, పిల్లలతో ట్రాప్స్‏కు వెళ్లినా వారితో గడిపిన మధురక్షణాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

ఈ విషయంలో స్నేహా కూడా తక్కువేం కాదు. ఈ మధ్యన అల్లు స్నేహ హాట్ ఫోటో షూట్‏లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. హీరోయిన్స్ సైతం ఆమె అందం చూసి అవాక్కవుతున్నారు. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. స్నేహ ఎప్పుడు ఏ పిక్ పోస్ట్ చేసినా గంటల్లోనే అవి నెట్టింట్లో వైరల్ అయిపోతుంటాయి.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. త్వరలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.