allu arjun wife sneha reddy entry into films with star hero
mictv telugu

షాకింగ్.. సినిమాల్లోకి అల్లు అర్జున్‌ భార్య.. ఆ స్టార్ హీరోతో తొలి చిత్రం ?

November 4, 2022

గత కొద్దీ రోజులుగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఆరోగ్య సమస్యలపై ఆసనాలు వేసిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు తాజాగా స్నేహ రెడ్డి ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఫోటో షూట్ అంటే అలాంటి ఇలాంటిదేమీ కాదు. ప్రొఫెషనల్ మోడల్స్ తరహాలో దిగిన ఫోటోషూట్. సినిమాల్లో అవకాశాల కోసం నటీమణులు ఏర్పాటు చేసుకునే పోర్ట్ ఫోలియో. ఇదంతా చూసి స్నేహ రెడ్డికి ముగ్దులైపోయారు ఫాన్స్. అయితే ఆ ఫోటోలు ఎదో సరదాగా తీసుకుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు స్నేహ రెడ్డి ఫోటో షూట్ పై ఒక సెన్సేషన్ న్యూస్ బయటికొస్తుంది. స్నేహారెడ్డి ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అసలు సినిమాలకే సంబంధం లేని విద్యా సంస్థలున్న కుటుంబం నుండి వచ్చిన స్నేహారెడ్డి బన్నీతో పెళ్లి తరువాత కూడా సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. సెలబ్రెటీల వారసుల వలే కనీసం స్టైలింగ్ లో కూడా పాల్గొనలేదు.

అలాంటి స్నేహ ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో కానీ అల్లు ఫాన్స్ మాత్రం అప్పుడే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పేస్తూ సలహాలు సైతం ఇచ్చేస్తున్నారు. ‘ఆ స్టార్ హీరోతో హీరోయిన్ గా మాత్రం చేయకండి వదిన.. మంచి క్యారెక్టర్ చేయండి చాలు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్నేహ రెడ్డి చేయబోతుంది తెలుగు సినిమా కాదని.. మలయాళం మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి మలయాళంలో స్టార్ హీరో క్రేజ్ ఉంటుంది. దాంతో తెలుగులో కంటే మలయాళం ఫాన్స్ ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. మల్లూవుడ్ నుండి స్నేహారెడ్డి సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. కానీ చాలా మంది నెటిజనులు మాత్రం ఇవన్ని వట్టి రూమర్స్‌ మాత్రమే.. ఆమె సినిమాల్లోకి వచ్చే చాన్స్‌ వన్‌ పర్సెంట్‌ కూడా లేదంటున్నారు.