Allu Arjun's Pushpa album hits 5 billion views
mictv telugu

అల్లు అర్జున్ నయా రికార్డ్.. పుష్పతో ఫస్ట్ ఇండియన్ హీరోగా గుర్తింపు

July 13, 2022

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించింది. రూ. 350 కోట్ల వసూలును సాధించి అల్లు అర్జున్ స్థాయిని పెంచింది. ఇందులో తగ్గేదే లే అనే మేనరిజమ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా పాటల ఆల్బమ్ 5 బిలియన్ల వ్యూస్‌ను సాధించింది. అంటే 500 కోట్ల వ్యూస్ అన్నమాట. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. ఇంతవరకు ఏ హీరో సినిమా కూడా ఈ రికార్డును సాధించలేదు. ఇందులో శ్రీవల్లి, సమంత ఐటెం సాంగ్ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. ఇంతకు ముందు నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ సాధించింది. దీంతో అల్లు ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 త్వరలో షూటింగ్ ప్రారంభించబోతోంది. దీని కోసం ఇప్పటికే రూ. 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్టే అంతుంటే ఇక సినిమా ఏ స్థాయిలో వసూలు చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.