బన్నీ మూవీ రికార్డ్.. తొలి భారతీయ సినిమాగా  - MicTv.in - Telugu News
mictv telugu

బన్నీ మూవీ రికార్డ్.. తొలి భారతీయ సినిమాగా 

July 16, 2020

Allu Arjun's Sarrainodu in dubbed Hindi version becomes first Indian film to hit 300 million views on YouTube

కళ్లు చెదిరే ఫైట్లు, పంచు డైలాగులు, ఊరమాస్ యాక్షన్, క్రేజీ డాన్సులు, భారీ బ్యాక్‌గ్రౌండ్, పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అల్లు అర్జున్. ఇక ఆయనకు దర్శకుడు బోయపాటి శ్రీను జత అయ్యాడంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టరే. బన్నీకి కేరళాలో చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హిందీలో కూడా బన్నీకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెగిరింది. ఎందుకంటే తెలుగులో వచ్చిన ‘సరైనోడు’ సినిమా హిందీలో సూపర్ డూపర్ హిట్ సాధించింది. యూట్యూబ్‌లో 300 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో సరైనోడు పేరుతోనే విడుదలై హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. 

హిందీ సినిమాలు కూడా ఈ స్థాయిలో వ్యూస్ సాధించలేకపోయాయి. ఈ మేరకు అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్వీట్ చేశారు. ‘సరైనోడు సినిమా ఆల్‌ టైమ్ రికార్డు సృష్టించింది. 300 మిలియన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
కాగా, 2016లో విడుదలైన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌ నటించగా.. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను అల్లు  అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ నిర్మించింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.