అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన సందర్భంగా తన మామ చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. సినిమా రంగానికి కొంచెం దూరంగా ఉండే చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు అల్లు అర్జున్ కోసం మొదటిసారి పార్టీ ఇచ్చారు. దాంతో పాటు అతిథులను కూడా ఆయనే స్వయంగా ఆహ్వానించడం విశేషం. పార్టీ ఇవ్వడంతో పాటు తన అల్లుడిని ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ పార్టీ నిర్వహించగా.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు ముఖ్య అతిథులుగా వచ్చారు. వారితో పాటు అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, హరీష్ శంకర్, గుణశేఖర్ తదితరులు హాజరయ్యారు. కాగా, పుష్ప సినిమాలో విలన్ ఫాహద్ డైలాగ్ ‘పార్టీ లేదా పుష్పా’ చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్పరాజ్ పార్టీ ఇవ్వకపోయినా.. ఆయన మామ పార్టీ ఇచ్చారని టాలీవుడ్లో సరదాగా జోకులు వేసుకుంటున్నారు.