ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ చిత్రం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి భానుశ్రీ మెహ్రా తెలియకపోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మారడంతో ఆవిడకు సరైన అవకాశాలు రాలేదు. కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసినా అవి కూడా సరిగా ఆడకపోవడంతో ఆమె తెరమరుగైంది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ.. తను కంటెంట్ క్రియేటర్‌గా మారింది. ఉన్నట్టుండి ఆమె వార్తల్లో నిలిచింది. ట్విట్టర్ లో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడని ట్వీట్ చేసింది. ఆ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
#AlluArjun #BhanuShree pic.twitter.com/9GQS30PV9E
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) March 18, 2023
‘నేను అల్లు అర్జున్‌తో వరుడులో నటించానని గుర్తుంచుకోండి. ఇప్పటికీ సరైన అవకాశాలు రావట్లేదు. కానీ ఈ ఇబ్బందుల్లోనూ సరదాగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినా కూడా’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో బన్నీ ఆమెను ఎందుకు బ్లాక్ చేశాడా? అని ఫ్యాన్స్ ఆరాతీయడం మొదలు పెట్టారు. అయితే కొంత సమయం తర్వాత బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడని భానుశ్రీ తెలిపింది. ‘గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేసాడు. నా కెరీర్ వైఫల్యాలకు నేను అతనిని ఎప్పుడూ నిందించలేదని స్పష్టం చేస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పింది.
ఈ ట్వీట్ కాస్త వైరల్ అవ్వడంతో.. అసలు కథేంటని బన్నీ ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలెట్టారు. హీరోయిన్ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమెకు పని లేదు. ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో వీడియోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ సోషల్ మీడియాలో షేర్ చేయడం… ఆ లింక్స్ అల్లు అర్జున్, ఇతర హీరోలకు ట్యాగ్ చేస్తున్నారు. ప్రతిసారీ వీడియో లింక్స్ ట్యాగ్ చేసి ఉండటంతో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ ఉందని ప్రతి వీడియో ట్యాగ్ చేస్తూ ఉంటే బ్లాక్ చేయడా? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భాను శ్రీ మెహ్రా తీరును ఎండగట్టడం స్టార్ట్ చేశారు. కొంత మంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఎటాక్ చేశారు.
ఇంతా చేసిన భాను శ్రీ చివరకు నైట్ అయ్యే సరికి ఓ పెగ్గేసినట్టుంది. అందరికీ గుడ్ నైట్ చెప్పింది.. ఈ రోజంతా కూడా వింతగా జరిగిందని, అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించిందని, తానేమీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ వేయలేదని చెప్పుకొచ్చింది. నేను కూడా బన్నీకి ఫ్యాన్‌నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను.. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను.. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు అంటూ భాను శ్రీ ట్వీట్ వేసింది.