Allu Shirish praised Allu Arjun
mictv telugu

భవిష్యత్తులో నాకేం మిగల్చకుండా చేశాడు.. అల్లు అర్జున్‌‌‌పై శిరీష్

November 7, 2022

Allu Shirish praised Allu Arjun

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన తాజా సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో శిరీష్‌‌‌కి జోడీగా అను ఇమ్మానుయేల్ నటించింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భంగా ఈ చిత్ర యూనిట్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శిరీష్ బన్నీ గురించి మాట్లాడగా.. బన్నీ ఎమోషనల్ అయ్యాడు. ‘బన్నీ నన్ను ఎప్పుడూ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూసుకుంటాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నప్పుడు మైబేబీ శిరి అని రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత నేను కలిస్తే చిన్నపిల్లాడిలా బుగ్గగిల్లుతాడు. నేనంటే ఆయనకు అంత ప్రేమ. నేను ఏదైనా లైఫ్‌లో సాధించాలనుకుంటే అవేవీ మిగల్చకుండా చేశాడు. అందుకు కూడా థ్యాంక్స్. వచ్చే ఏడాది పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలైపోతుంది. మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో దేశానికి చూపిస్తుంది’ అని అన్నారు శిరీష్. దీంతో తమ్ముడి మాటలకు బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.